ETV Bharat / state

మునుగోడులో తమ్ముడికే ఓటెయ్యండి.. సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్

Komati Reddy Audio Viral: తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాయిస్​తో ఉన్న ఆడియో లీక్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ ఆడియో.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాలిడే ట్రిప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు.

author img

By

Published : Oct 21, 2022, 4:28 PM IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాయిస్​
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాయిస్​

Komati Reddy Audio Viral: తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పార్టీల అగ్రనేతలంతా నియోజవర్గంలో మోహరించారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆడియో లీక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో మునుగోడు నియోజక వర్గానికి చెందిన ఓ కాంగ్రెస్‌ నేతకు ఫోన్‌ చేసి రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు ఉపఎన్నిక వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు.. కాంగ్రెస్‌ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది. రాజగోపాల్‌రెడ్డి భాజపా నుంచే పోటీ చేస్తుండగా.. వెంకట్‌రెడ్డి మాత్రం తాను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ తరఫున మునుగోడులో ప్రచారం చేయనని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్‌ నేతతో.. వెంకట్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉపఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని ఆ ఆడియోలో కోరారు.

మునుగోడు ఉపఎన్నికలో పార్టీ చూడకుండా ఈసారి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంచీచెడు సమయాల్లో రాజగోపాల్‌రెడ్డి సాయం చేశారని కోమటిరెడ్డి అనడం ఆ ఆడియోలో ఉంది. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని... వచ్చాక రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ఆడియోలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకా.. అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న రాత్రి కుటుంబసభ్యులతో ఆస్ట్రేలియా వెళ్లారు. పదిరోజులు అక్కడే ఉండనున్నారు. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆడియో లీక్‌ గురించి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మునుగోడులో తమ్ముడికే ఓటెయ్యండి.. సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.