వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను.. పోలీసులు నేడు మచిలీపట్నం కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయమూర్తి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ను విచారించే అవకాశం ఉంది. గూడూరు పోలీస్ స్టేషన్లో ఆయనకు కరోనా, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మోకా భాస్కర్రావు హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముందు జాగ్రత్తగా మచిలీపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చదవండి: