కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం.. వివాదాస్పదమైంది. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. పోలీసులతో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వాగ్వాదానికి దిగారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు మద్దతుగా నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి:
CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!