రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు.
ఇదీ చదవండి: గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ సమావేశం