జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేకాట క్లబ్బులను మూయిస్తోందే తప్ప ప్రోత్సహించటం లేదని కొడాలి స్పష్టం చేశారు. మంత్రిగా, రాష్ట్ర ప్రజలకు, ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్తానే తప్ప.. ఎవరో చేసిన ఆరోపణలు పట్టించుకోనని అన్నారు.
ఇదీ చదవండి: