కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి షఫియుద్దీన్‌ను పోలీసులు క్షేమంగా విడిపించారు. ఈ కిడ్నాప్‌కు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన షఫియుద్దీన్ తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారుజామున షఫియుద్దీన్ ఫోన్ నుంచి అతని కుమారునికి ఓ ఆగంతుకుడు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని... సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి