అక్రమమో... సక్రమమో.... కానీ ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చాలనే ఆలోచనను విజయవాడ ఎంపీ కేశినేని తప్పుపట్టారు. అది కూల్చివేసే ముందు అక్రమ నిర్మాణాలన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. చివరిగా ప్రజావేదికను పడగొట్టాలని సూచించారు. దీన్ని కూల్చివేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు రెండు నష్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాధనంతో నిర్మించిన కట్టడం కూల్చి వేస్తే.. సొమ్ము వృథా అవుతుందని... మరో వేదిక కట్టేవరకు ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">