కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయంలో అమ్మవారిని దీపాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. నందిగామ శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
నూజివీడులో ఆధ్యాత్మిక శోభ
నూజివీడులోని మూడు శివాలయాలు కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు ప్రమిధలు వెలిగించి పూజలు నిర్వహించారు. వీరభద్రస్వామి, భద్రావతి అమ్మ వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: