కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం దగ్గర వశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనంతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే భక్తులు అధికసంఖ్యలో తరవివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేశారు. అమరేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివార్లకు వైభవంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
భీమవరం పంచారామ క్షేత్రంలో స్వామివారు శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నారు. సోమేశ్వరస్వామి వారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరి, మనశ్శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దేశంలోనే స్వామివారి శిరస్సు పైభాగాన అమ్మవారు ఉండడం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తోంది. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారు మ్రోగుతున్నాయి.
ఇదీ చదవండి: