ETV Bharat / city

ముక్కంటికి అభిషేకాలతో... కార్తీక దీపాలతో..

కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీపాలు వెలిగిస్తూ పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అభిషేకాలతో పూజిస్తున్నారు. ప్రముఖ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఇదే రోజు కోటి సోమవారం అవడం మరింత విశేషమని పండితులు చెప్పారు.

kaarteeka somavaram
author img

By

Published : Nov 4, 2019, 10:37 AM IST

Updated : Nov 4, 2019, 11:53 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణాలు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు, 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు. ముమ్మడివరం మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.. యానం వద్ద గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో జల్లు స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదిలారు. పి.గన్నవరం లోని గరుడ స్వామి, కారేపల్లి అగ్రహారంలోని పార్వతి సోమేశ్వర స్వామి, బెల్లంపూడి లోని లక్ష్మీశ్వర స్వామి, పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వర స్వామి, ముక్తేశ్వరం ముక్తికాంతా క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక సోమవార పూజలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లోని గోకర్ణేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, పంచారామ క్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తణుకు పాతవూరు సిద్ధేశ్వరాలయం, కపర్ధీశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది.

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో కార్తీక సాగర హారతి నిర్వహించారు. ఉపసభాపతి కోన రఘుపతి హారతి ఇచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులచే కార్తీక సాగర హారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పల్నాడు దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం, పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయం, మాచవరం శ్రీ బొగ్గ మల్లయ్య దేవస్థానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారు జాము మూడు గంటల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చీరాల భ్రమరాంబామల్లీశ్వరి స్వామి దేవాలయం, పేరాల లోని శ్రీ పునుగు రామలింగేశ్వరస్వామి వారి దేవాలయాల్లో గరళకంఠునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. కంభం పట్టణంలోని సుందర మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ రాజరాజేశ్వరి దేవాలయం, కేశవస్వామి పేటలోని శివాలయం, కొప్పోలు భీమేశ్వరాలయం లలో భక్తులు స్వామి దర్శనానికి క్యూ కట్టారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలోని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్నూలు హరిహరపుత్ర క్షేత్రంలో మహిళలు తెల్లవారుజామునే దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శివుని కి అభిషేకాలు చేశారు.

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_11_04_UNDRAJAVARAM_GOKARNESWARUDU_AV_AP10092
(. ) కార్తీకమాసం మొదటి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ముక్కంటికి అభిషేకాలు పూజలు చేశారు.

Body:పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లోని గోకర్ణేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాస సోమవారం రోజు ముక్కంటి దేవుని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. స్వామివారికి కి పాలతో కొబ్బరినీళ్ళతో అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Conclusion:మహిళలు ఆలయ ప్రాంగణంలో, ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపారాధన చేశారు.
Last Updated : Nov 4, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.