కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ముగ్గురు ఉద్యోగులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కార్యాలయంలో టిక్‌టాక్ చేసినందుకు చర్యలు తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న దివ్యమణి, సమత, ల్యాబ్ అటెండెంట్ జయలక్ష్మిలు టిక్‌టాక్‌లో నటించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం నిన్న రాత్రి వెలుగులోకి రాగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని తొలుత భావించినా... అనంతరం ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్ చేశారు. ముగ్గురు కూడా కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగాలు పొందడం విశేషం.
ఇదీ చూడండి : గాంధీ ఆసుపత్రిలో మరో టిక్‌టాక్