మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన తీరు చూస్తే చాలా బాధేస్తోందని రాజ్యసభ ఎంపీ కనకమేడల ఆవేదన వ్యక్తం చేశారు. గోడలు దూకి, ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. నోటీసు ఇచ్చి, విచారణ చేశాక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా అరెస్టులు సాగుతున్నాయని కనకమేడల అభిప్రాయపడ్డారు. అచ్చెన్నాయుడిని ఎందుకు విచారించలేదు అని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసు ఇవ్వాలన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై కూడా కేసులు పెట్టారన్న కనకమేడల.. ఈ అరెస్టులు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు