ETV Bharat / state

పాలకుల నిర్లక్ష్యం, సంక్షోభంలో కలంకారీ పరిశ్రమ - Pedana Kalamkari

Kalamkari Industry in Crisis: వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న కలంకారీ పరిశ్రమలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో సంక్షోభానికి గురవుతున్నాయి. ప్రభుత్వ నిరాదరణ కారణంగా కార్మికులు కలంకారీ పని వదలి.. ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. కృష్ణాజిల్లా పెడన కలంకారీ పరిశ్రమ కార్మికుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

kalamkari_industry_in_crisis
kalamkari_industry_in_crisis
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 2:02 PM IST

Kalamkari Industry in Crisis: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కలంకారీ పరిశ్రమ - పాలకుల నిర్లక్ష్యంతో నేడు సంక్షోభంలో

Kalamkari Industry in Crisis: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన పెడన కలంకారీ హస్తకళల పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. రసాయన రహిత రంగులతో చేతి పనితో రూపుదిద్దుకునే కలంకారీ వస్త్రాలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి.

గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ పరిశ్రమ పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల.. ప్రస్తుతం కళ తప్పి వెలవెలబోతోంది. దీని కారణంగా కార్మికులు కలంకారీ పని వదలి ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో కలంకారి హస్తకళల పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని కార్మికులు వాపోతున్నారు.

AP Jaggery Industry ఆ బెల్లం మాటలు ఏమైయ్యాయి..! మాట నిలుపుకోని జగన్.. సంక్షోభంలో బెల్లం పరిశ్రమ!

కలంకారీ పరిశ్రమను ప్రస్తుతం అనేక సమస్యలు చుట్టుముట్టాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కలంకారీ పరిశ్రమల్లో వేతనాలు లభించకపోవడం, ఉత్పత్తి చేసిన వస్త్రాలకు మార్కెట్లో గిరాకీ లేకపోవడం, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల.. ఈ వృత్తికి చాలామంది స్వస్తి చెబుతున్నారు.

సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు.. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. కూరగాయలు.. ఇతర పదార్ధాలతో విభిన్న రంగులు తయారు చేసి.. వస్త్రానికి అద్దుతుంటారు. చెట్ల వేర్లు, బెరడు, ఆకులు, పళ్లు, పువ్వులు, పాలు, పేడ వంటి వాటితో సహజ రంగులు తయారు చేస్తారు. ఇవి శరీరానికి ఏ మాత్రం హాని చెయ్యవు. ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కరక్కాయ రసాన్ని వస్త్రానికి పెట్టడం, మార్కెట్లోకి వెళ్లేముందు మెరుగులు దిద్దుకునేందుకు క్యాలండరింగ్ యంత్రం, బాయిలింగ్.. చేస్తుంటారు.

Spinning Industry Problems: సమస్యల సుడిగుండంలో స్పిన్నింగ్ పరిశ్రమ..

వస్త్రంపై ముద్రించిన తర్వాత.. విభిన్న పద్ధతుల్లో ఉతకడం వల్ల వస్త్రాలపై వేసిన రంగులు.. ఎప్పటికీ వెలిసిపోవని కార్మికులు చెబుతున్నారు. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు, గలీబులు, ప్రవేశ ద్వార వస్త్రాలు, జంతు రూపాలు, వివిధ పుష్పాలతో కూడిన వివిధ రకాల డిజైన్లను తయారు చేస్తుంటారు.

కానీ ప్రస్తుతం ముడి సరకు ధరలు పెరగడం, జీఎస్టీ వంటి కారణాలతో ఇప్పటికే చాలా కలంకారీ యూనిట్లు మూతపడ్డాయి. చాలామంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. చేనేత పరిశ్రమలాగా ప్రభుత్వం తమను కూడా గుర్తించాలని కలంకారీ పరిశ్రమ కార్మికులు కోరుతున్నారు.

Poultry: కష్టంగా ఉంది.. గిట్టుబాటు కావటం లేదంటూ.. పౌల్ట్రీ రైతుల ఆందోళన..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి మరింత ఘోరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం కనుక ఇలాగే వ్యవహరిస్తే కలంకారీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదముందని కార్మికులు చెబుతున్నారు. పరిశ్రమల్లో వస్త్రాల తయారీకి నీళ్ల సమస్య వేధిస్తుందని.. చాలిచాలని నీటితో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేలాది మందికి ఉపాధినిస్తున్న కలంకారీ పరిశ్రమను ప్రభుత్వం గుర్తించి.. సమస్యలను పరిష్కరించి.. చేనేతలకు ఇస్తున్నట్లే తమకు సహకారం అందిచాలని కార్మికులు కోరుతున్నారు.

Textile Park Problems: టెక్స్‌టైల్ పార్క్ సమస్యలతో ఎదురీత..ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.