కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి నారాయణ నివాసంలో సీఐడీ సోదాలు చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ రెడ్డి రాక్షస, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములు మాదిరిగా ప్యాకేజీ ఇవ్వడమే తప్పా అంటూ నిలదీశారు. ఇడుపులపాయలో 700 ఎకరాల ఎస్సీ అసైన్డ్ భూములను జగన్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందన్న ఆయన విశాఖలో 2500 ఎకరాల అసైన్ మెంట్ భూములు తీసుకున్న జగన్ రెడ్డి కూడా నేరం చేసినట్టేనా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి విధ్వంస విధానాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కళావెంకట్రావు కోరారు.
ఇవీ చూడండి...