ETV Bharat / state

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ - చంద్రబాబు అమరావతి పర్యటన

చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన ఘటనలపై విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కళా వెంకట్రావు కోరారు. ఈ మేరకు లేఖ రాశారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ
కళా వెంకట్రావు(పాతచిత్రం)
author img

By

Published : Dec 2, 2019, 8:53 PM IST

చంద్రబాబు అమరావతి పర్యటనలో దాడిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిపై విచారణ జరపాలని ఆయన లేఖలో కోరారు. గతంలో చలో ఆత్మకూరు విషయంలోనూ చంద్రబాబును గృహ నిర్బంధం చేసి, గేట్లను తాళ్లతో కట్టారని వివరించారు. పోలీసులే అనుమతివ్వకపోవడాన్ని కళా తప్పుబట్టారు. జిల్లాల పర్యటనల్లోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావు లేఖలో వివరించారు.

kala venkatarao wrote letter to central home secretary
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ

ఒక్క సామాజికవర్గానికే సింహభాగం

విశ్వాసఘాతానికి, విధ్వంసానికి, వికృత చర్యలకు జగన్మోహన్‌ రెడ్డి ఆరు నెలల పాలన కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కళా వెంకట్రావు... రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వైకాపా నాయకులు దేవాలయాలను కూల్చేస్తూ.. వక్ఫ్​ భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ తన సామాజిక వర్గానికే సింహ భాగం అధికారం ఇచ్చుకున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ వైఖరితో సుమారు రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్ ఏపీ మిషన్​ పేరుతో తక్కువ ధరకే విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి

'ఇంత విచిత్రమైన నాయకుడిని ఎప్పుడూ చూడలేదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.