ETV Bharat / state

కృష్ణా జిల్లాకు 801 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు.. - కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు

కృష్ణా జిల్లాకు 801 డాక్టర్. వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు మంజూరైనట్లు జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇవ్వనున్నారు.

Joint Collector madhavi latha
జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత
author img

By

Published : Jun 8, 2021, 3:36 PM IST

కృష్ణా జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 801 రైతు భరోసా కేంద్రాల్లో 801 డాక్టర్​ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు మంజూరైనట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్​ మాధవిలత చెప్పారు. వీటిపై వ్యవసాయ యంత్రపరికరాల డీలర్లు, వ్యవసాయ అధికారులతో జేసీ సమీక్షించారు. మూడు దశల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 246 డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐదుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి సంబంధిత రైతు భరోసా కేంద్రంతో ఒప్పందం చేసుకొని.. ఆ కేంద్రం పరిధిలోని రైతులకు యంత్రపరికరాలు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా ఒక్కొక్క కేంద్రానికి 15 లక్షల రూపాయలు తీసుకునేందుకు మంజూరు చేశారు. ఈ 15 లక్షల్లో 50 శాతం రైతు గ్రూపు సంబంధిత డీలర్లకు సొమ్ము చెల్లిస్తే, పరికరాలు సరఫరా జరిగిన అనంతరం డీసీసీబీ బ్యాంక్ మిగిలిన 50 శాతం రుణం కింద డీలర్లకు మంజూరు చేస్తారు. జూలై 8న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున.. సీఎం జగన్ 40 శాతం రాయితీ సొమ్ము రైతుల ఖాతాకు జమ చేస్తారన్నారు. డీలర్లు, సిబ్బందికి అవసరమైన కొవిడ్ పాస్ లు ,ఇతర సహకారాన్ని అందిస్తామన్నారు. త్వరగా డీలర్లు తమ పేర్లు నమోదు చేయుంచుకుని,వ్యవసాయ పరికరాల తయారీని మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి.మోహన్ రావు, పలువురు డీలర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. veligonda project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1,365 కోట్లు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.