కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జే నివాస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్ ఇంతియాజ్ బదిలీ కాగా ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న నివాస్ నియమితులయ్యారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో నేటి సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్‌లు, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ నివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: Junior Doctors : త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు : జూడాలు