అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని అడిగేందుకు వెళ్తున్న తమను... పోలీసులు అడ్డుకున్నారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు మెుండిచేయి చూపారని దుయ్యబట్టారు. వారికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
' అగ్రిగోల్డ్ అంశంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేశారు. అవి కేవలం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకేనా..? అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా బాధితులను ఆదుకోలేదు. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.' - బోనబోయిన శ్రీనివాస్, జనసేన నేత
ఇదీ చదవండి: ఆ బిల్లులను మండలిలో మరోసారి అడ్డుకుంటాం: బుద్దా వెంకన్న