పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనపై వైకాపా దుష్ప్రచారం తగదని జనసేనా పార్టీ మైలవరం ఇంచార్జ్ అక్కల గాంధీ హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఎన్ని వేల కోట్లు తీసుకువచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తెదేపా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రహదారులకు అనుమతులు లేవంటూ రభస చేసిన వైకాపా ఇప్పుడు అన్ని అనుమతులు తీసుకునే రోడ్లను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ గా తనను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు అక్కల ధన్యవాదాలు తెలిపారు..
ఇదీచూడండి.'హైదరాబాద్ నిమ్స్ తరహాలో విశాఖ విమ్స్'