కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. జనసేన నాయకుల బృందం నియోజకవర్గ బాధ్యుడు మురళి కృష్ణ ఆధ్వర్యంలో పొలంపల్లిలోని ఆనకట్టను సందర్శించారు. పోలంపల్లి ఆనకట్ట పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆనకట్ట నిర్మిస్తే వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల పరిధిలో 20000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనకట్టను సందర్శించిన మంత్రుల బృందం.. ఏడాదిలోగా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.. కానీ ఏడాది పూర్తయిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తిచేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి. ఈ నెల 20 నుంచి 'ప్రథమ్' మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ టికెట్లు