ETV Bharat / state

'జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రావడం ఖాయం' - జనసేన

రాబోయే రోజుల్లో జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని వంగవీటి నరేంద్ర జోస్యం చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామలో జనసేన అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారాన్ని నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే.. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆదరించాలని కోరారు.

vangaveeti narendra
వంగవీటి నరేంద్ర
author img

By

Published : Feb 28, 2021, 7:21 AM IST

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలోని 19, 20 వార్డుల్లో జనసేన అభ్యర్థుల గెలుపు కోసం వంగవీటి నరేంద్ర ప్రచారం నిర్వహించారు. భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. జనసేన తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

అసెంబ్లీ ఎన్నికలకన్నా పంచాయతీ ఎన్నికలలో ఓట్ల శాతం పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన, భాజపా కూటమి మరింత బలపడి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వంగవీటి అభిమానులకు అన్ని పార్టీల్లో అన్యాయం జరిగిందని.. వారంతా జనసేన, భాజపా వైపు నడవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

పన్నుల పేరుతో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది: ఆలపాటి రాజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.