ETV Bharat / state

పోలవరంపై ప్రజల్ని మోసగిస్తున్న జగన్ సర్కార్.. వైఎస్సార్సీపీ విముక్త ఏపీ మా లక్ష్యం : జనసేన

author img

By

Published : Apr 5, 2023, 5:43 PM IST

Updated : Apr 6, 2023, 10:58 AM IST

Nadendla manohar fire on govt : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. కేవలం రాజకీయంగా బురదజల్లేందుకు ప్రాజెక్టు అంశాన్ని వాడుకుంటున్నారని.. కేంద్ర మంత్రి షెకావత్​ తో భేటీ సందర్భంగా పలు విషయాలు తెలిసి అవాక్కయ్యాం అని పేర్కొన్నారు. త్వరలో పోలవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలిపారు.

నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్

జనసేన నేత నాదెండ్ల మనోహర్

Nadendla manohar fire on govt : రాష్ట్రాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. ఆయన ఎంతో లోతుగా ఆలోచన చేసి ఈ నినాదం ఇచ్చారు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ పెద్దలకు అన్నీ వివరించాక.. వాళ్లు కూడా పవన్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక అంశాలను వారికి వివరించాం.. భవిష్యత్తు తరాల‌ మేలు కోసం మంచి నిర్ణయంతో ముందుకు సాగుతాం అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పెద్దల సహకారం అవసరని, వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వారు కూడా కలిసి నడుస్తారనే నమ్మకం ఉందని మాకు కూడా నమ్మకం కలిగిందని మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు.. త్వరలోనే జిల్లాల వారీగా జనసేన కార్యాచరణ చేపడుతుందని, ఈ‌ ప్రభుత్వం లో మార్పు తెస్తాం... రాష్ట్రానికి మేలు చేయడమే మా ఉద్దేశం అని స్పష్టం చేశారు.

పోలవరం ఎత్తుపై మోసం.. పోలవరం ఎత్తు 41.15 మీటర్లు తగ్గించడానికి అనుకూలంగా జగన్ లేఖ ఇచ్చారా లేదా అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రం కోసం‌ వెళుతున్నట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.. కానీ, నాలుగేళ్లుగా ఒకటే మెమోరాండం ఇస్తున్నారని, తేదీ ఒక్కటే మారుస్తున్నారని తెలిపారు. పోలవరం ‌విషయంలో రాజకీయం‌ చేయాలని మేము అనుకోవడం లేదు.. రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం పోలవరం పూర్తి చేయాలని కోరుతున్నాం.. ఇదే అంశాన్ని కేంద్ర పెద్దలకు మా అధినేత ‌వివరించారని వెల్లడించారు.

ఆశ్యర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి... మేము చెప్పిన అంశాలు‌ విని..‌ జగన్ ఇంత మోసం చేస్తున్నారా..! అంటూ కేంద్ర మంత్రి ఆశ్చర్యపోయారని తెలిపారు. మా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ని వివరించాం.. వైఎస్సార్సీపీ విముక్త ఏపీ కోసం కలిసే పని చేద్దాం అన్నారు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కొంత గ్యాప్ ఉందని చెప్తూ.. కేంద్ర నాయకత్వాన్ని నమ్మాం కాబట్టే కలిసి నడుస్తున్నామని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేస్తూ.. వైఎస్సార్సీపీకి ఓటు‌ వేయవద్దని పిలుపునిచ్చాం అని చెప్పారు. పరిపాలన చేత కాక... జగన్ ప్రకటనలకే పరిమితం అయ్యారని, ఇప్పటి వరకు మోసాలతో, మాయలతో పాలన చేశారని మండిపడ్డారు. పొత్తుల విషయంలో మా అధినేత సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. టీడీపీతో కలిసే అంశం పైనా చర్చ జరిగిందని చెప్తూ.. రాజకీయ అంశాలు చర్చకు రావడం సహజమని మనోహర్ అన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. పోలవరం గురించి కేంద్రమంత్రి షెకావత్‌తో పవన్ చర్చించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. షెకావత్‌తో మాట్లాడిన తర్వాత.. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలిసిందని పేర్కొన్నారు. పోలవరంపై సీఎం జగన్ ప్రకటనలకే పరిమితమయ్యారని, ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి లేదని మనోహర్‌ విమర్శించారు. 2022లో పోలవరం నుంచి సాగు నీరు అందిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సాకులు చెప్తున్నాడని అన్నారు. పోలవరం ఎత్తుపై 41.15 మీటర్లకు మీరు ఒప్పుకున్నారా.. లేదా..? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని మనోహర్‌ డిమాండ్ చేశారు.

నాలుగేళ్లుగా నిధుల మళ్లింపు... పోలవరం గురించి నాలుగేళ్లుగా మీరేం చేశారని ప్రశ్నిస్తూ.. మీరు మార్చిన లెక్కల వల్లే కేంద్రం మళ్లీ సర్వే చేయిస్తోందని తెలిపారు. పోలవరం నిధులను ఇతర పథకాలకు మళ్లించలేదా అని దయ్యబట్టారు. కేంద్రానికి అనుమానం వచ్చి పనులు పూర్తయ్యాకే బిల్లులు చెల్లిస్తామని అంటోందని తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్లను మార్చారు.. రివర్స్ టెండరింగ్ అన్నారు.. తీరా ఇప్పడేం జరుగుతోంది అని మనోహర్‌ ప్రశ్నించారు. పోలవరాన్ని కేంద్రమే తీసుకుని పూర్తి చేయాలని జనసేన కోరిందని చెప్తూ.. పవన్‌ త్వరలో పోలవరం ప్రాంతంలో పర్యటిస్తారని, వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. పోలవరం పునరావాసం, బ్యాక్‌వాటర్, ముంపు తదితర అంశాలపై పవన్ తెలుసుకుంటారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నామని పేర్కొన్నారు.

''కేంద్ర మంత్రి కొన్ని వివరాలు మాతో పంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పోలవరం మన రాష్ట్రానికే గర్వకారణం. 2014 విభజన చట్టంలో పోలవరం నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని ప్రత్యేకంగా స్పష్టం చేసింది. కానీ, తాజా పరిణామాలు తెలిసి ఆశ్చర్యపోయాం. అవాక్కయ్యాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రతీ సంవత్సరం రెండు మూడు సార్లు ప్రాజెక్టును సందర్శించారు. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. శాసనసభ వేదికగా రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం ఆరోపణలు చేయడానికి మాత్రమే ప్రాజెక్టు అంశాన్ని వాడుకున్నారు. ఈ రాష్ట్ర ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇదే విషయం కేంద్ర మంత్రితో జరిపిన సమావేశంలో మాకు అర్థమైంది. ప్రజలను మోసం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2021 జూన్ లో పూర్తి చేస్తామని 2019 జూన్​లో ప్రకటించారు. అంతకు ముందు.. 2020 ఖరీఫ్ కు సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. తీరా కేంద్రం సహకరించడం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. మార్చి 23న శాసనసభలో చర్చ సందర్భంగా ప్రాజెక్టు ఎత్తు పై చేసిన ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. నాలుగేళ్లుగా సమయం వృథా చేస్తున్నారు.'' అని మనోహర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 6, 2023, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.