Jana Sena TDP joint action : తెలుగుదేశం నేతలతో జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జనసేన నిర్ణయించింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 29 నుంచి మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ ఉమ్మడి పోరాట కార్యాచరణ ఖరారు చేయాలని సూచించారు. పొత్తుని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ పన్నే ఉచ్చులో పడొద్దని జనసేన నేతలకు నాదెండ్ల సూచించారు.
TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!
రాజమండ్రిలో జరిగిన జనసేన - టీడీపీ (TDP - Janasena) సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయటంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయిలో పొత్తును క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 29, 30, 31 తేదీల్లో జిల్లా స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులతో ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు జరగాలన్నారు. భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు..
జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో పాటు టీడీపీ సూపర్ సిక్స్ (TDP Super Six) లో ప్రకటించిన అంశాలను కలిపి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నాటికి ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం అవుతుందన్నారు. రెండు పార్టీలు కలవకూడదని వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వైసీపీ (YCP) తప్పుడు ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యల ఉచ్చులో పడవద్దని... పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేవనెత్తిన అంశాలను మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్లాలని నిర్ణయించారని... బీజేపీ (BJP) కూడా కలసి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోరాట కార్యాచరణలో మొదటి అంశంగా సాగునీటి సమస్యను ఖరారు చేశారు. రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని. క్షేత్ర స్థాయిలో రైతుల వద్దకు వెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో ఇతర సమస్యలపై కలసి ముందుకు వెళ్లాలన్నారు.
జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టని ఐదు జిల్లాలకి సీనియర్ నాయకులను సమన్వయకర్తలుగా నియమించారు. శ్రీకాకుళం జిల్లాకు పాలవలస యశస్వి, విజయనగరం జిల్లా - లోకం నాగమాధవి, కడప జిల్లా - సుంకర శ్రీనివాస్, కర్నూలు జిల్లా - చింతా సురేశ్, విశాఖ అర్బన్ - కోన తాతారావు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
Prathidwani: టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది..?