జల ఉద్యమంలో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ప్రత్యేక కార్యశాల నిర్వహించింది. జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు, జల సంరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు జలశక్తే... జనశక్తి.... జనశక్తే... జలశక్తి నినాదంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి రతన్ లాల్ అన్నారు. ఈ దిశగా కేంద్రం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయడం శుభసూచకమన్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్న పలువురు రైతులు.. తమ అనుభవాలను కార్యశాల వేదికగా పంచుకున్నారు. నీటి నిర్వహణ విధానాలను తెలియజేస్తూ ముద్రించిన గోడ పత్రాలు, కరపత్రాలు, ప్రచార పత్రాలను కేంద్ర మంత్రి రతన్ లాల్, రాష్ట్ర మంత్రి అనిల్.. కార్యశాలలో విడుదల చేశారు.
ఇదీ చూడండి... ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలి