కృష్ణానది నుంచి ఇసుక తరలించే విషయమై.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని రెండు గ్రామాల మధ్య తలెత్తిన వివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇసుక తరలించడానికి.. వేరే గ్రామాల నుంచి వస్తున్న ఎడ్లబండ్లను కోసురువారిపాలెం గ్రామస్థులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది.
తమను కోసురువారిపాలెం గ్రామస్తులు అడ్డుకుంటారా.. అని మిగిలిన గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. కోసురువారిపాలెం గ్రామస్తుల పంట పొలాలు తమ గ్రామ పరిసరాల్లోనే ఉన్నాయని.. అక్కడికి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా.. ఈ ప్రదేశం నుంచి ఇసుక తరలించరాదని మోపిదేవి మండల తహసీల్దార్.. గతంలోనే ఆదేశాలు జారీచేశారు. దారికి అడ్డంగా కంచె వేసి, బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. అయినా.. ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: