ETV Bharat / state

బొట్టుబిళ్లల పేరుతో పంగనామాలు.. లబోదిబోమంటున్న బాధితులు..

Investment fraud in Hyderabad: ఇంట్లో కూర్చొని సంపాదించే ఉద్యోగం. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఒక్కసారి డబ్బులు వెచ్చించారంటే, జీవితాంతం కూర్చొని సంపాదించొచ్చు. ఇలాంటి మాటలు సాధారణంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంటాయి. మాయ మాటలు నమ్మి, వెనుకా ముందు ఏమీ ఆలోచించరు. నిండా మునిగాక, నెత్తీనోరు బాదుకుంటారు. ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి మోసాలతో కొందరు కేటుగాళ్లు అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో బాధితుల తీగలాగితే, తెలుగు రాష్ట్రాల్లో డొంకంతా కదిలొచ్చింది.

బొట్టుబిళ్లల పేరుతో పంగనామాలు..
బొట్టుబిళ్లల పేరుతో పంగనామాలు..
author img

By

Published : Nov 29, 2022, 9:24 AM IST

బొట్టుబిళ్లల పేరుతో పంగనామాలు.. లబోదిబోమంటున్న బాధితులు..

Investment fraud in Hyderabad: బొట్టుబిళ్లల తయారీ అంటూ.. ఏకంగా పంగనామాలే పెట్టారు. దీపం వత్తులు దందా అని, చివరకి చీకట్లో నెట్టేసి వెళ్లిపోయారు. గృహిణిలే లక్ష్యంగా చేసుకుని, యూట్యూబ్ వేదికగా ప్రకటనలిచ్చి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది మహిళలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ ఏఎస్. రావునగర్‌లో ఆర్​ఆర్. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఓ కార్యాలయాన్ని తెరిచాడు.

ఇంటి వద్దనే ఉండి, నెలకు 30 వేలు సంపాదించే అవకాశమంటూ.. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చాడు. వీటిని చూసిన పలువురు ఆయనని సంప్రదించారు. ఇలా తన వద్దకొచ్చిన వారికి.. తమ వద్ద దీపం ఒత్తులు తయారు చేసే యంత్రం, బొట్టుబిళ్లల యంత్రం తీసుకుంటే.. ముడి సరుకును తామే ఇచ్చి, తయారు చేసిన వాటిని కొంటామని నమ్మబలికాడు.

మూడేళ్ల పాటు ఒప్పందం: గతంలో తాను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పటంతో నమ్మి, సంప్రదించిన వారంతా వరుసగా యంత్రాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా రూ. 2లక్షల 80వేలకు బొట్టుబిళ్లల తయారి యంత్రం, లక్షా 80వేలకు దీపం వత్తుల తయారుచేసే యంత్రాన్ని విక్రయించాడు. యంత్రాలు కొన్నవారితో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న రమేశ్.. రూ. 250కు కిలో దూదిని కస్టమర్లకు అమ్మి.. వారి నుంచి కిలో ఒత్తులను 550కి కొంటున్నాడు.

బొట్టుబిళ్లల ముడి సరుకును రూ.2వేలకు ఇచ్చి, తయారు చేసిన వాటిని రూ. 2,600కు కొంటానని ఒప్పందం చేసుకున్నాడు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 1400 మంది ఈ యంత్రాలను కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో ధరకు యంత్రాలు విక్రయించటం, మరికొందరికి ఈఎమ్​ఐ పద్ధతిలో విక్రయాలు.. మరికొంత మందిని చేర్పించిన వారికి కమీషన్లు ఇస్తూ వచ్చాడు.

ఇలా.. 2021 నుంచి ఇప్పటి వరకూ దీపం ఒత్తుల యంత్రాలు 842 మంది, బొట్టు బిళ్లల యంత్రాలు 600 మంది కొనుగోలు చేశారు. మొదట రెండు మూడు నెలల పాటు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించిన రమేశ్​.. తరువాత చెల్లింపులు వాయిదా వేస్తూ వచ్చాడు. ప్రారంభంలో ఇంటికి వచ్చి తయారైన సరుకును తీసుకెళ్లగా.. రాను రానూ కస్టమర్లే కార్యాలయానికి వచ్చి సరుకును అందించాల్సి వచ్చేది.

కొద్ది రోజులుగా కస్టమర్లు తయారు చేసిన సరుకును తీసుకోకపోగా, డబ్బులూ ఇవ్వకపోవటంతో వారంతా రమేశ్‌ను నిలదీశారు. కొందరు యంత్రాలను తిరిగి ఇచ్చి, డబ్బులు ఇవ్వమన్నారు. దీంతో నిర్వాహకుడు రమేష్ బిచానా ఎత్తేశాడు. మోసపోయామని గ్రహించిన కస్టమర్లు హైదరాబాద్ కుషాయిగూడా పోలీసులను ఆశ్రయించారు.

చిట్టీలు వేసి కొందరు.. నగలు తాకట్టు పెట్టి మరికొందరు, డ్వాక్రా రుణాలతో ఇంకొందరు.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. లక్షల రూపాయాలతో కేటుగాడు ఉడాయించటంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాధితురాలు పురుగుల మందు సేవించి, ఆస్పత్రి పాలైంది. పోలీసులు ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కొలీజియం సిఫార్సులు వెనక్కి.. 20 దస్త్రాలను తిప్పి పంపిన కేంద్రం!

హాట్​ హాట్​గా మలైక కేథరిన్​ ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.