ETV Bharat / state

రైతు సంక్షేమమే ప్రాధాన్యం..: మంత్రి కన్నబాబు - how raithu bharosa kendram will work

ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా పనిచేయనున్న రైతు భరోసా కేంద్రాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి..

Interview with Agriculture Minister Kannababu on Farmer Assurance Centers
రైతు భరోసా కేంద్రాలపై వ్యవసాయ మంత్రి కన్నబాబుతో ముఖాముఖి
author img

By

Published : May 29, 2020, 9:10 PM IST

ప్రతినిధి: ఈ రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు?

మంత్రి : వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో 2వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఉంటుంది. వీటి ద్వారా ప్రభుత్వం నాణ్యత పరిశీలించి, పరీక్షించి, ఆమోదించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తారు. అది ఒక ఉద్యమంలా నేడు రాబోతోంది. దీనినే రైతు విజ్ఞాన కేంద్రంగా పెట్టాం. ఇక్కడ మామూలు గ్రంథాలయంతో పాటుగా డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది. రైతులు అక్కడున్న కియోస్క్​ల ద్వారా కావల్సిన విత్తనాలు, పురుగు మందులు వంటి వాటిని ఆర్డరు ఇవ్వొచ్చు. వెంటనే రైతు ఆర్డర్ హబ్​కు వెళ్తుంది. వాటిని కంపెనీ నుంచి తెప్పించి నేరుగా రైతు భరోసా కేంద్రాలకు రెండురోజుల్లో చేరవేస్తారు. అంతేకాకుండా రైతుకు ఏమైనా సమస్య ఉందని చెప్తే విజ్ఞాన కేంద్రం ద్వారా నేరుగా శాస్త్రవేత్తలకు అనుసంధానం చేస్తారు. శాస్త్రవేత్తలు ఆన్​లైన్ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తారు. ముఖ్యమంత్రి, అధికారులు అన్ని కేంద్రాలలోని రైతులతో ఒకేసారి ఆన్​లైన్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది.

ప్రతినిధి: గతంలో సంప్రదాయ పద్ధతిలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేవారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా ఏమి మేలు జరగబోతోంది?

మంత్రి : గతంలో విత్తనాలు కావాలంటే మండలాలకు వెళ్లాల్సి వచ్చేది. క్యూలైన్లలో నిల్చుని వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే నాణ్యమైన విత్తనాలు అందిస్తాం. సీజన్ దాటిపోకూడదని ఇప్పటికే 15రోజుల ముందు నుంచే మొదలు పెట్టారు. చరిత్రలోనే తొలిసారిగా వేరుశెనగ విత్తనాల పంపిణీని మే నెలాఖరుకే పూర్తి చేస్తున్నాం. ఎంతో పకడ్బందీగా అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాం. ఆధునిక సాంకేతికత, ప్రకృతి వ్యవసాయం, ఆక్వాకల్చర్ వంటి వాటిపై శిక్షణ అందిస్తున్నాం. మట్టి నమూనాల పరిశీలన, విత్తన నమూనాల పరిశీలన, ఆక్వా ప్రాంతాల్లో నీటి పరీక్షల కోసం కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ-క్రాప్ బుకింగ్ వంటి కీలక సేవలు అందుబాటులోకి వస్తాయి. సీఎం ఆదేశాల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్​ నెట్ వర్క్ కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి అమలు చేయబోతున్నాం. అక్కడి వ్యవసాయశాఖ సహాయకులు ప్రతిరోజు పంటల వివరాలను యాప్ ద్వారా మార్కెటింగ్ శాఖకు అందిస్తారు. మార్కెటింగ్ శాఖ ఆ వివరాలను అధ్యయనం చేసి పంటను అమ్మేందుకు సూచనలు చేస్తుంది. ఎమ్మెస్పీలు కూడా ప్రదర్శిస్తారు. పొలాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి.

ప్రతినిధి: రైతులకు క్షేత్ర స్థాయిలో పంటల గురించికానీ, సాంకేతికత గురించి కానీ, పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్న రైతు భరోసా కేంద్రాలపై గానీ అవగాహన లేదు. వారికి అర్థమయ్యే పరిస్థితి లేదు. అవి వారికి ఏవిధంగా ఉపయోగపడతాయి?

మంత్రి : ఆర్బీకేలో వ్యవసాయశాఖ సహాయకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు, ఆక్వాకల్చర్ సహాయకులు ఉంటారు. తెలుగులోనే జాబితా ఉంటుంది. రైతులు వారికి కావల్సిన లేదా సమస్యను చెబితే సహాయకుల సాయంతో అక్కడ నుంచి ఆర్డర్లు చేయవచ్చు. అమెజాన్ తరహాలో సేవలు అందనున్నాయి. రైతుకు ఎటువంటి కష్టం వచ్చినా బాధ్యత వహించేందుకు ఆర్బీకే భరోసా కల్పిస్తుంది. వైఎస్సార్ పొలంబడి, చేపల బడి, రొయ్యల బడులకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాం.

ప్రతినిధి: రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు, ఇతర సేవలతో కలిపి ఎన్నిరకాల సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు?

మంత్రి : రైతుకు అవసరమైన ప్రతీ సేవ ఆర్బీకేలో అందుబాటులో ఉంటాయి. పంటల అమ్మకం, రెవిన్యూ రికార్డుల వివరాలు, అనుసంధానం, విత్తనాలు, మార్కెట్ వివరాలు, పశువులకు సంబంధించిన సేవలు, ఆక్వాకల్చర్ వివరాలు ఇలా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రతీ సేవ అందుబాటులో ఉంటాయి. భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా క్షేత్రస్థాయిలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలా ఈ పథకం ప్రారంభంకాబోతోంది.

ఇదీ చదవండి: 'బీసీల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత వైకాపాదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.