ETV Bharat / state

నేటి నుంచి గన్నవరం ఎయిర్​పోర్ట్​లో అంతర్జాతీయ విమాన సేవలు - krishna district latest news

Gannavaram Airport: విజయవాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న అంతర్జాతీయ విమానయాన సేవలు.. నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభం కానున్నాయి.

Gannavaram Airport
గన్నవరం ఎయిర్​పోర్ట్​
author img

By

Published : Oct 31, 2022, 10:45 AM IST

Gannavaram Airport: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయాన సేవలు నేడు ప్రారంభమవుతాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. విమానయాన శాఖ మంత్రి, ఎయిర్ ఇండియా అధికారులతో అనేకసార్లు ఈ విషయమై దిల్లీలో చర్చించిన తర్వాత అనుమతులు లభించాయన్నారు.

ఎయిర్ ఇండియా వారిచే విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజులు పాటు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం, శనివారం రాత్రి 9.05 గంటలకు విమానం బయలు దేరుతుందని తెలిపారు.

ఈ రోజు సాయంత్రం తొలిసారిగా విజయవాడ వచ్చి షార్జాకు ప్రయాణీకులను తీసుకెళ్లనుందని అన్నారు. అలాగే విజయవాడ నుంచి మస్కట్​కు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు, విజయవాడ నుంచి కువైట్​కు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విమానాలు నడుపుతారని తెలిపారు. నేటి సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి మొదటిసారిగా వస్తున్న షార్జా విమానానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి స్వాగతం పలుకుతారు. అలాగే షార్జాకు వెళ్లే ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులను అందచేస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.