కృష్ణా జిల్లా కంచికచర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఓ కుటుంబం.. రాజ్యాంగం, ఓటు హక్కు పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. ఆ కుటుంబం అభ్యర్థుల వినూత్నంగా తమ విన్నపం తెలిపింది. కంచికచర్లలోని చిన్నంశెట్టి వీధిలో ఓ ఇంటికి వినూత్న రీతిలో.. 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు' అని బ్యానర్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ బోర్డు చూసి కంచికచర్ల వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా బ్యానర్ పెట్టిన టి.అర్జునరావును స్థానికులు మెచ్చుకుంటున్నారు. అందరూ అర్జునరావులా ఆలోచించాలని చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండీ... 'తప్పు చేసినందుకే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారు'