రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 'నిమిషం ఆలస్యమైతే అనుమతి నిరాకరణ' అనే నిబంధనను సండలించామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కాస్త ఆలస్యంగా వచ్చినా పరీక్షలకు అనుమతిస్తామని.. స్థానిక పరిస్థితులను బట్టి అక్కడి అధికారులు నిర్ణయం తీసుకంటారని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థుల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు. అవి
- విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి. ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ల సహకారంతో పూర్తి చేయాలి.
- ఈసారి నిమిషం నిబంధన లేదు. కాస్త ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతిస్తారు. ఆలస్యానికి సరైన కారణాలుంటేనే పరిశీలించి అనుమతిస్తారు.
- విద్యార్థులు bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థుల మొబైల్ నంబర్‌కు లింక్ పంపిస్తారు(కొన్ని కళాశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆపివేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు).
- 'నో యువర్ ఎగ్జామినేషన్ సెంటర్' యాప్ ద్వాారా పరీక్షా కేంద్రం, కేటాయించిన సీటు తెలుసుకునే సౌలభ్యం ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రం వివరాలు, లొకేషన్ తెలుస్తుంది.
- ఈసారి నో యువర్ సీట్ అనే యాప్ సైతం అందుబాటులో తీసుకొచ్చారు. తర్వాత రోజు జరిగే పరీక్షలో తమ సీటు వివరాలను ముందు రోజే తెలుసుకోవచ్చు.
- విద్యార్థులకు అందుబాటులో 20 కిలోమీటర్లలోపే పరీక్షా కేంద్రాలు కేటాయించారు. సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు ఉంది.
- విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్లు ఏర్పాటు. ఎక్కడైనా సమస్య ఎదురైతే సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్, వాట్సప్ నెంబర్, ఈ మెయిల్ సౌకర్యం కల్పించారు. విద్యార్థులు 1800 2749868, 0866 2974130 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
- విద్యార్థులు 93912 82578 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమస్యలు తెలియజేయవచ్చు. అలాగే ourbieap@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
ఏర్పాట్లు ఇలా
- ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే మొదటి సంవత్సరం విద్యార్థులు 5,46,368. రెండో సంవత్సరం విద్యార్థులు 5,18,788.
- రాష్ట్ర వ్యాప్తంగా 1,114 కేంద్రాలు ఏర్పాటు.. 105 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా.
- ఇన్విజిలేటర్లను పూర్తిస్థాయిలో జంబ్లింగ్ విధానంలో నియామకం.
- అన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ ఏర్పాటు, ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు.
- పరీక్షల తనిఖీ కోసం జంబ్లింగ్ విధానంలో టాస్క్‌ఫోర్స్ బృందం తొలిసారిగా ఏర్పాటు. సమస్యాత్మక కేంద్రాల్లో ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ల కేటాయింపు.
ఇదీ చూడండి: