కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి ఐఓసీ సౌత్ ఈస్టర్న్ పైప్లైన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీసీ చౌబే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విద్యార్థినీలకు సూచించారు. పరిశుభ్రతకు ప్రాధ్యాన్యత ఇవ్వాలని కోరుతూ... శానిటరీ కిట్లను విద్యార్థినులకు అందజేశారు. అనంతరం ఎంపిక చేసిన 30 మంది రైతులకు పవర్ స్ప్రేయర్లను అందజేశారు.
ఇదీ చూడండి: ప్రతీ ఒక్కరూ గ్రామ స్వచ్ఛతకు తోడ్పడాలి: కలెక్టర్