విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు. విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేకంగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మైదానాన్ని పరిశీలించారు భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కొన్ని శాఖల అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించే విధంగా శాఖల వారీగా శకటాలు రూపొందించారు. జాతీయ పతాక అవిష్కరణ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ నింబంధనలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. బందోబస్తు కోసం 3 వేల మందిని వినియోగిస్తున్నామని ద్వారకా తిరుమలరావు వివరించారు. ఎట్ హోం కార్యక్రమానికి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామనీ... అతిథులకు ఏ1, ఏ2, ఏ3, బి1, బి2 పాసులు కేటాయించామని చెప్పారు.
ఇది కూడా చదవండి