రాష్ట్రవ్యాప్తంగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాయాత్ర చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వైకాపా నేతలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో రాష్ట్ర వాణిజ్య విభాగ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైకాపా ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పరిపాలన వికేంద్రీకరణ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.
ఇవీ చదవండి: