తెదేపా సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్‌కు అగ్రరాజ్యంలో అరుదైన గౌరవం లభించింది. గాంధేయవాదిగా, సమాజ సేవకునిగా, మంత్రిగా, ఉప సభాపతిగా వివిద హోదాల్లో ఆయన చేసిన సేవలను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు చేస్తోన్న కృషిని ప్రస్తుతిస్తూ... అమెరికాలోని నాపెర్ వెల్లి నగరం అక్టోబర్ 25వ తేదీని 'బుద్ద ప్రసాద్ డే' గా ప్రకటించింది. దీనికి సంబంధించి నాపెర్ వెల్లి నగర మేయర్ స్టీవ్ చిరికా జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని కమిషనర్ జూడిత్ బ్రాడ్ హెడ్ బుద్ద ప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భారతి తీర్థ వ్యవస్థాపకులు ఆయన సేవలను కొనియాడారు.
బాధ్యతను పెంచింది
అందమైన, పర్యావరణ హితమైన నగరంగా పేరొందిన నాపెర్ వెల్లి నగరం తనను గౌరవించినందుకు మండలి బుద్ద ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.
ఇదీ చదవండి: