ఆయుర్వేద వైద్యులు ఆధునిక శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతినిచ్చిన సీసీఐఎం నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ... ఐఎంఏ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 1 నుంచి ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షను ముగించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య విధానంలో తెస్తున్న మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఆయుర్వేద వైద్యులు సర్జరీలు చేసేందుకు అనుమతిస్తే... ప్రజలకు నాణ్యమైన వైద్యం అందదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనాభాలో అధికశాతం అలోపతి వైద్యం మీదే ఆధారపడి ఉన్నారని ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డా.నందకిషోర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వెనక్కు తీసుకోకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఐఎంఏ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గండ్రంలో పోలీసుల కార్డెన్ సెర్చ్