ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు చేసేలా కేంద్రం అనుమతినివ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ ఐఎంఏ హాల్లో మహిళా వైద్యులు ఆందోళనలు చేపట్టారు.
ఆయుర్వేద వైద్యంలో పీజీ చేసిన వారికి ఆరు నెలల శిక్షణనిచ్చి శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతివ్వటం సరికాదని ఐఎంఏ వైద్యులు అభ్యంతరం తెలిపారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో...
![అమలాపురంలో...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-23-07-ima-doctors-nirasana-amalapuram-ap10020_07022021190853_0702f_1612705133_1024.jpg)
అమలాపురంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన చేపట్టారు. పీజీ చేసిన ఆయుర్వేద వైద్యులను శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఇదీ చదవండి:
పెద్దిరెడ్డికి జైలు జీవితం తప్పదు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి