కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాసరబాధ వద్ద కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న పది ట్రాక్టర్లు , రెండు జేసీబీలను పోలిసులు పట్టుకున్నారు. 400 టన్నుల ఇసుకను సీజ్ చేసి 12 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా నదిలో నేరుగా యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండగా... నందిగామ గ్రామీణ సీఐ సతీష్ దాడులు నిర్వహించారు.
కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఇసుక నిల్వల వద్ద కాపలాగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: