అంబులెన్స్‌లో మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో... కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి వస్తున్న అంబులెన్స్‌ను వెంబడిస్తూ... వీరులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాపురం చెక్‌పోస్ట్ వద్ద ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
అంబులెన్స్‌లో 107 మద్యం సీసాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: