ETV Bharat / state

కొనాయపాలెం 130 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం - illegal

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 130 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ration rice
author img

By

Published : Jul 11, 2019, 10:39 AM IST

కొనాయపాలెం 130 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

కృష్ణా జిల్లా కొనాయపాలెంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 130క్విటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స అధికారులు వెల్లడించారు.

కొనాయపాలెం 130 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

కృష్ణా జిల్లా కొనాయపాలెంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 130క్విటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స అధికారులు వెల్లడించారు.

Intro:FILENAME:AP_ONG_32_10_NALLAMALA_ELAVELPU_PALANKA_KSHETRAM_PKG_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

నల్లమల ఇలా వేల్పు
వీరభద్రుడు
రేపటి నుంచి మూడు రోజులపాటు తిరునళ్ళు
పలు జిల్లాల నుంచి తరలి రానున్న భక్తులు


ఎటుచూసినా పాలుగారే వృక్షాలతో దట్టమైన అడవి..... మైమరపించే ప్రకృతి రమణీయత.... అటుగా వెళుతూ ఈ అందాలను చూసి పరవశించి....
నల్లమల అందాలను ఆస్వాదించి జీవాలతో పూజలందు కొనేందుకు పరమశివుడు విరభద్రుడిగా వెలసిన క్షేత్రమే పాలంక. ముఖ్యంగా ఇక్కడి జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గతుల్యం గోచరిస్తుంది. నల్లమల అరణ్యంలో లో ప్రకృతి రమణీయత నడుమ కొలువుదీరిన పాలంక క్షేత్రం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల్ల లోని పాలుట్ల సమీపంలో ఈ ఆలయం లో ఏటా తొలి ఏకాదశి ఉత్సవాలను మూడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 12 తొలి ఏకాదశి సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు వార్షిక తిరునాళ్ల సందర్భంగా గా ఈటీవీ ప్రత్యేక కథనం


ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో లో ఈ పాలంక జలపాతం 200 మీటర్ల ఎత్తులో నల్లమల్ల లోని పెద్దది గా గుర్తింపు పొందింది. ఏటా ఆషాడ అ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇక్కడ తిరునాళ్ల జరుగుతుంది. కృష్ణానది పక్కన శ్రీశైలానికి ఉత్తర భాగాన పెద్ద కొండ చరియ కింద పాలంక స్వామి వెలిశారు. ఈ క్షేత్రంలో సహజంగా ఏర్పడిన ఆదిశేషుని ఆకారం వంటి కొండచరియ కింద పాలంకేశ్వరుడి తో పాటు గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తున నాగమయ్య పుట్ట ఉన్నాయి.

చుక్కల పర్వతం.... సంతాన ఫలం....
ఆలయం పైన చుక్కల పర్వతం ఉంది. సంతానం లేని దంపతులు గుండంలో స్నానమాచరించి దీని కింద కూర్చుని చేతులు చాపితే అరచేతిలో నీటి బిందువులు పడతాయి ఇలా పడ్డ వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడకు వచ్చాక పిల్లలు పుట్టిన వారు తమ సంతానానికి పాలంక వీరయ్య, వీరయ్య, పాలంకయ్య, పాలంకమ్మ, భద్రయ్య, భద్రమ్మ వంటి పేర్లు పెడతారు. ప్రకాశం ,గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ పేర్లతో వందల మంది కనిపిస్తారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులు నదిని దాటుకుని ఇక్కడకు చేరుకుంటారు. పాలంక క్షేత్రం నుంచి కృష్ణా నదికి 8 కి మీ దూరం ఉంటుంది. ఈ జలపాతం నీళ్లు ఆ నదిలోని కలుస్తాయి.

తరలిరానున్న అశేష భక్త జన సందోహం...
విరభద్రునికి ధూపధిప నైవేద్యలు ప్రారంభమైయ్యాక .. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుంది.దీనికితోడు ఆలయం నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణ తీరం వెంట ఉండటంతో పర్యాటక కేంద్రంగా గా ప్రకృతి ప్రేమికులకు కు ఆకర్షిస్తుంది ది ఈ ఏడాది ఉత్సవాలు పురస్కరించుకొని వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఆలయం ఆలయం అటవీ ప్రాంతంలో ఉండడంతో కాలినడకన వచ్చేవారు ఒక రోజు ముందే చేరుకుంటారు. వందలాది వాహనాలు బారులు తీరుతాయి. భక్తులు పాలక క్షేత్రంలో రాత్రి బస చేసి మరుసటి రోజైనా తొలి ఏకాదశి నా మొక్కులు తీర్చుకుంటారు.ప్రకాశంతో పాటు గుంటూరు కర్నూలు మహబూబ్నగర్ జిల్లా లతో కూడా భక్తులు తరలిరానున్నారు.

ఇలా చేరుకోవచ్చు.....
తొలి ఏకాదశి ముందురోజున ఎర్రగొండపాలెం లోని కొలుకుల రహదారిలో లారీలు ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగతంగా అయితే జీపులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి ఇతర వాహనాలు వెళ్ళలేవు. కొందరు యువకులు నడుచుకుంటూ, ద్విచక్ర వాహనాల పైన చేరుకుంటారు. కొండపైన వాహనాలు నిలిపి లోయలోకి దిగి సుమారు 2 కిమి నడుచుకుంటూ వెళ్లి స్వామివారి ఆలయం చేరుకుంటారు

భోజన వసతి........
పాలంక కొండపై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 11 తేదీ నుంచి ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు పలువురు భక్తులు తెలిపారు.12 వ తేదీ మధ్యాహ్నం వరకు ఇది కొనసాగుతుందన్నారు.Body:Shaik khajavaliConclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.