ETV Bharat / state

కరిగింది కొండ.. ఎవరిది అండ..? జగనన్న కాలనీల మెరక పేరిట పెద్దఎత్తున తవ్వకాలు - ap latest news

ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన ఆ కొండ.. చూస్తుండగానే కరిగిపోయింది. కేవలం మూడు నెలల్లోనే కొండ ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. భారీ యంత్రాలతో కొండను పిండిచేసేశారు. అనధికారికంగా అందినకాడికి రేయింబవళ్లు తవ్వేశారు. మరో ఐదారు గుట్టలు.. సగం వరకు నరికేసిన చెట్టులా మారిపోయాయి.

illegal gravel mining in krishna district
జగనన్న కాలనీల మెరక పేరిట పెద్దఎత్తున తవ్వకాలు
author img

By

Published : Dec 31, 2021, 5:30 PM IST

జగనన్న కాలనీల మెరక పేరిట పెద్దఎత్తున తవ్వకాలు

కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల అభివృద్ధి మాటున భారీగా గ్రావెల్‌ దందా సాగుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే కొండలు, గుట్టలు కరిగించేస్తున్నారు. జగనన్న కాలనీలు మెరక చేసినట్లు ఎక్కడా కనిపించనప్పటికీ.. లక్షల ఘనపు మీటర్ల గ్రావెల్, ఎర్రమట్టి మాయమవుతోంది. దీనికి గన్నవరంలోని కొండపోరంబోకు స్థలాలే సాక్ష్యాలుగా నిలిచాయి. గతేడాది గన్నవరం, ఆగిరిపల్లి మండలాల్లో 20 వరకు క్వారీలు గ్రావెల్‌ లీజులు తీసుకున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే మంజూరు చేశారు.

ఒక్కో క్వారీలో 50వేల ఘనపు మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉండగా.. అంతకు పదిరెట్లు ఎక్కువగా మట్టి తరలించేసిన దాఖలాలు ఉన్నాయి. పోలవరం కట్టలపైనా 5వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేందుకు అనుమతులు ఇవ్వడం విశేషం. ఇక్కడ లక్ష ఘనపు మీటర్లకు పైగా తవ్వకాలు జరిపారు.

అనధికారికంగా తవ్వకాలు

ప్రస్తుతం గోపవరపుగూడెం, ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లిలో రెండు ప్రాంతాలకే అనుమతులు ఉండగా పలుచోట్ల అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారు. విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణ సంస్థకు గన్నవరం మండలం కొండపావులూరులో లీజు కేటాయించారు. రహదారికి 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కావాల్సి ఉండగా.. స్థానిక నేతలు సబ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు. కొంత మట్టిని రహదారికి, మిగిలింది ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గన్నవరంలో కొండలమీద తవ్వకాలు జరుపుతున్నారు. గన్నవరం మండలానికి చెందిన ఓ నేత అనుచరులే ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం.

వేలాది లారీల్లో తరలింపు

కొండపావులూరులోని జగనన్న కాలనీలకు ఒక్క తట్ట మట్టి కూడా వేయని గుత్తేదారులు.. ఇతర ప్రాంతాలకు మాత్రం వేలాది లారీల్లో తరలిస్తున్నారు. లీజు సమయం ముగిసిన తర్వాత కూడా.. సూదిగట్టు, పాతాలగట్టు, గడబాలగట్టు, వెదురు పావులూరు, పురుషోత్తంపట్నం గట్టు, గోపాలపురం, సూరంపల్లి, పల్లంతిప్ప పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయి.

అనుమతి లేకున్నా సాగుతున్న తవ్వకాలు

కనీసం పర్యావరణం గురించి పట్టించుకోకుండా.. రెవెన్యూ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని గనులశాఖ అనుమతులు ఇచ్చింది. గ్రావెల్ లారీలతో నూజివీడు- విజయవాడ రహదారి మొత్తం గుంతలమయంగా మారిపోయింది. ఈ ఏడాది గనుల శాఖ నుంచి ఒక్క లీజుకు కూడా అనుమతి జారీ చేయలేదు. కానీ తవ్వకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: GST Council Meeting: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి: మంత్రి బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.