జాతీయ రహదారిని ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని నందిగామ డీఎస్పీ ఏవి రమణ మూర్తి హెచ్చరించారు. కృష్ణాజిల్లా కంచికంచర్లలో జాతీయరహదారిని పోలీసులతో కలిసి పరీశిలించారు. చిరువ్యాపారం చేసుకునేవారు, దుకాణాదారులు రోడ్లను ఆక్రమించరాదని సూచించారు. తల్లి తండ్రులు పిలల్లకు వాహనాలు ఇచ్చేసమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లితండ్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
ఇవీ చదవండి