కరోనా నివారణ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చేశారు. డ్రోన్ సాయంతో రాజ్‌భవన్ ఆవరణ మొత్తం సుమారు 120 లీటర్ల ద్రావణాన్ని స్ప్రే చేశారు. రాజ్‌భవన్ వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు రాజ్ భవన్ ప్రాంగణం అంతటా సుమారు రెండు గంటల పాటు ద్రావణాన్ని పిచికారి చేశారు. విజయవాడలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. రాజ్ భవన్ భద్రతాపరంగా ప్రతిరోజు తగిన రీతిలో ఈ ద్రావకాన్ని పిచికారి చేయించాలని అధికారులు నిర్ణయించారు.
ఇవీ చదవండి: కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు