ఇదీ చదవండి : ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి... బంధువుల ఆందోళన
భార్యపై అనుమానంతో రోకలిబండతో దాడి చేసిన భర్త - నందిగామ
భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన భర్త ఉదంతం ఇది. ఈ విషాదకర సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
భార్యపై అనుమానంతో రోకలిబండతో దాడి చేసిన భర్త
కృష్ణా జిల్లా నందిగామ చెరవు బజారులో నివసించే జంగం శివపార్వతి పై అనుమానంతో ఆమె భర్త వీరబాబు రోకలి బండతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో పెద్దగా అరవటంతో వీరబాబు అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితురాలిని గమనించిన స్థానికులు హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వీరబాబు కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి... బంధువుల ఆందోళన