కృష్ణా జిల్లా కోరుకొల్లుకు గ్రామానికి చెందిన ఊసల యోహాను ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన భార్య ఆనందకుమారి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉద్యోగం నిమిత్తం వీరు 20ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థిరపడ్డారు. భర్త అనారోగ్యానికి గురవడంతో కొన్నిరోజులు స్వగ్రామంలో గడిపి వెళ్దామని ఆ కుటుంబం గత నెలలో కోరుకొల్లు వచ్చారు.
ఈ క్రమంలో యోహాను అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం అందించినప్పటికీ... యోహాను ఆరోగ్యం మరింత క్షీణించి, ఆదివారం ఉదయం 10.30గంటలకు మృతిచెందారు. భర్త మరణంతో ఆనందకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయంత్రానికి భర్త మృతదేహాన్ని ఖననం చేసి సాయంత్రం 5.30గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన బంధువులకు ఊహించని సంఘటన ఎదురైంది. తీవ్ర ఉద్వేగానికి గురైన ఆనంద కుమారి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. వెంటనే ఆమె మృతదేహానికీ అంత్యక్రియలు నిర్వహించారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు తనను విడిచి కానరాని లోకాలకు వెళ్లారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారి కుమార్తె గుండెవలిసేలా రోదిస్తోంది.
ఇదీచదవండి: husband attack on wife: అనుమానమే పెనుభూతమై... కట్టుకున్న భార్యపై..