రాష్ట్రవ్యాప్తంగా దేవి నవరాత్రులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. నవరాత్రులలో మొదటి రోజు...స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా ముస్తాబైన జగన్మాతను కనులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తుల వెలుపలికి రాగానే మంగళ వాయిద్యాలు శ్రవనానందాన్ని కలిగిస్తున్నాయి. ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 150 మంది ఉభయదాతలు కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. దేదీప్యమానంగా ప్రకాశించే అమ్మవారి చెంత వేద పండితులు దివ్యమంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి శ్రీచక్రానికి భక్తులు కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తొమ్మిది రోజలు సాయంత్రం వేళ అమ్మవారి నగరోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: నవరాత్రుల్లో మొదటిరోజు ఈ నైవేద్యం పెడితే అనుగ్రహం మీ సొంతం