ETV Bharat / state

పసివాడని చూడకుండా.. పొట్టనబెట్టుకున్నాడు! - చల్లపల్లి

పసి హృదయం కరుడుగట్టింది. ఆట విషయంలో జరిగిన గొడవ.. విద్యార్థి ప్రాణాలు తీసేందుకు దారితీసింది. తన కంటే చిన్నవాడన్న కనికరం లేకుండా.. మూడో తరగతి పిల్లాడన్న జాలి చూపకుండా.. హత్య చేసేవరకూ తీసుకెళ్లింది.

పదో తరగతి విద్యార్థే.. హంతకుడు!
author img

By

Published : Aug 7, 2019, 9:57 AM IST

Updated : Aug 7, 2019, 12:04 PM IST

పదో తరగతి విద్యార్థే.. హంతకుడు!

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహం విద్యార్థి హత్యకేసులో మిస్టరీ వీడింది. అదే హాస్టల్లో ఉండే పదోతరగతి విద్యార్థి.. ఆదిత్యను హత్యచేసినట్లు పోలీసులు నిర్థరించారు. తనను తిట్టాడనే కోపంతో బ్లేడుతో ఆదిత్య మెడపై కోసి హతమార్చినట్లు గుర్తించారు. మంగళవారం వసతి గృహంలో చనిపోయిన మూడో తరగతి విద్యార్థి ఆదిత్య కేసులో పోలీసులు వివిధ కోణాల్లో నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టారు.

ఆటలో వివాదమే ప్రాణాలు తీసింది

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం... సోమవారం ఆడుకుంటున్న సమయంలో ఆదిత్యతో పదో తరగతి విద్యార్థికి వాగ్వాదం జరిగింది. అది గొడవకు దారితీసింది. ఇది చూసిన కాపలాదారు.. ఇద్దరినీ మందలించాడు. మనసులో పగ పెంచుకున్న సదరు పదో తరగతి విద్యార్థి... అదే రోజు రాత్రి ఆదిత్యను స్నానాల గదికి తీసుకెళ్లాడు. పెన్సిల్ చెక్కే బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు. అనంతరం రక్తపు మరకలు అంటుకున్న తన దుస్తులను పెట్టెలో దాచి ఏమీ తెలియనట్లు పడుకుండిపోయాడు. ఈ కారణంగానే.. హంతకుడు ఎవరన్నదీ పోలీసులు వెంటనే గుర్తించలేకపోయారు.
విస్తృత విచారణ అనంతరం పోలీసులు వాస్తవాలు గుర్తించారు. హత్య చేసిన పదో తరగతి విద్యార్థిని, హత్యకు వాడిన వస్తువులను అదుపులోకి తీసుకున్నారు.

కలెక్టర్ ఆగ్రహం

ఈ ఘటనపై కలెక్టర్ ఇంతియాజ్ సీరియస్​గా స్పందించారు. విధుల్లో అలసత్వంగా ఉన్న వసతిగృహం కాపలాదారుతో పాటు.. సంక్షేమ అధికారి రామరాజును సస్పెండ్ చేశారు.

ఇవీ చదవండి..

అమెరికా ప్రమాదంలో ఆంధ్రుడు మృతి.. ఆరిన శివ'తేజం'

Intro:నెల్లూరు జిల్లా

Body: సూళ్లూరుపేట పులికాట్ సరసు

Conclusion:
Last Updated : Aug 7, 2019, 12:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.