తెదేపా నేతలు కులరాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను అరెస్టు చేస్తే బీసీలపై దాడులని తెదేపా ఆరోపిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన అన్ని దాడుల్లో.. బాధితులకు న్యాయం చేసామని అన్నారు. చీరాల యువకుడి మరణానికి కారణమైన కేసుతో పాటు , దళిత యువకుడికి శిరోముండనం చేసిన అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన వైఎస్ఆర్ చేయూత పథకం పేద మహిళలకు ఎంతో మేలు కలుగుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ పథకం కింద 23 లక్షలకుపైగా మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆమె పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు తమ కుటంబాలను ఆర్థికంగా మెరుగుపరచుకోవాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి : టిక్‌టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!