నందిగామ పట్టణానికి చెందిన మాజీ హోం గార్డ్ గోనెల నాగ శ్రీనివాసరావు... ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిషోర్ వద్ద.. నాగ శ్రీనివాసరావు ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకున్నారు. వాటిని ఇవ్వాలని కానిస్టేబుల్ తరచూ అడుగుతుండడంపై... హోం గార్డ్ ఇబ్బంది పడ్డారు.
చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: