సెప్టెంబర్ 1 నుంచి 6 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1, 3, 4, 6,7,8 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని పలు ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అభ్యర్థులు పెద్దఎత్తున హాజరుకానుండటంతో అన్ని జిల్లాల్లో ఎక్కువ పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరగనున్న దృష్ట్యా... పరీక్షలు జరిగే రోజుల్లో స్థానికంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ప్రభుత్వాన్ని కోరగా... ప్రతిపాదనను ఆమోదించిన ప్రభుత్వం సెలవులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షించాలని...ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: జాబిల్లిపై దిగనున్న 'విక్రమ్'