ETV Bharat / state

గుడివాడలో హై టెన్షన్ - టీడీపీ, జనసేన శ్రేణులపై పోలీసుల లాఠీచార్జి

High Tention At Telugu Desam Party: కృష్ణా జిల్లా గుడివాడలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు సిద్ధమైన టీడీపీ-జనసేన శ్రేణులను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఇరు పార్టీల శ్రేణులు పోలీసుల అడ్డంకులను చేధించుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లారు.

High_Tention_At_Telugu_Desam_Party
High_Tention_At_Telugu_Desam_Party
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 2:05 PM IST

గుడివాడలో హై టెన్షన్ - టీడీపీ, జనసేన శ్రేణులపై పోలీసుల లాఠీచార్జి

High Tention At Telugu Desam Party : కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు సిద్ధమైన టీడీపీ-జనసేన శ్రేణులను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు వెళ్లరాదంటూ పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన విగ్రహానికి దండ వేయనీయకుండా అడ్డంకులేంటని తెలుగుదేశం, జనసేన శ్రేణులు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం కార్యాలయం వద్దకు ఇరుపార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొడాలి నాని కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని అడ్డుకోవటాన్ని నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.

Police Barriers TDP Janasena Leaders : గుడివాడ తెలుగుదేశం కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తెలుగుదేశం-జనసేన జెండాలతో కార్యకర్తలు బైకులు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించాల్సిందేనంటూ వెనిగండ్ల రాము బయలుదేరగా పోలీసులు అనుమతి లేదంటు అడ్డుకున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్​కు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. భారీగా పోలీసులు మోహరించారు.

గుడివాడలో "రా కదలి రా" బహిరంగ సభకు తరలుతున్న టీడీపీ శ్రేణులు- ఆంక్షలు విధిస్తున్న పోలీసులు

పోలీసులు భారీగా మోహరించడంతో గుడివాడ తెలుగుదేశం కార్యాలయం వద్ద పోలీసులకు తెలుగుదేశం, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లు తోసుకుంటూ రావి వెంకటేశ్వరరావు ముందుకు వెళ్లారు. పోలీసుల వలయాన్ని నెట్టుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపు తెలుగుదేశం జనసేన శ్రేణులు దూసుకెళ్లగా తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తెలుగుదేశం, జనసేన శ్రేణులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. పోలీసు బారికేడ్లను వాహనాలతో తెలుగుదేశం జనసేన శ్రేణులు గుద్దుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపు దూసుకెళ్లారు. కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహం వద్దే ఉన్నారు. తెలుగుదేశం వాహనాలను అడ్డుకునేందుకు పోలీసులు పరుగులు తీశారు.

Chandrababu Road show: చంద్రబాబు రోడ్ షో.. గుడివాడలో హై టెన్షన్.. భారీగా మొహరించిన పోలీసు బలగాలు

Arrangements For Ra Kadali Ra Program in Gudivada : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న"రా కదలి రా" సభకు దాదాపు లక్ష మంది కార్యకర్తలు హాజరవుతారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముదినేపల్లి రోడ్డులో మల్లాయిపాలెం వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక, పార్టీ అహూతులు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలు, పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. బందరు, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నారు.

తిరువూరులో తెలుగుదేశం 'రా కదలిరా' బహిరంగ సభ - భారీగా తరలివచ్చిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.